యుద్ధం.. సీఎం అత్యవసర సమావేశం
గల్ఫ్ దేశాల్లో ఏర్పడిన యుద్ధ పరిస్థితులపై తమిళనాడు సీఎం స్టాలిన్ అత్యవసర సమావేశం నిర్వహించారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తమిళుల పరిస్థితిపై ఆరా తీశారు. అలాగే గ్యాస్ సిలిండర్ల కొరతపై ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. అనంతరం LPG కొరత వల్ల ప్రజలకు, MSMEలకు, వాణిజ్య సంస్థలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సహకరించాలని కేంద్రానికి సీఎం లేఖ రాశారు.