అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ చామల ఫైర్
TG: దేశప్రజలను కేంద్రమంత్రి అమిత్ షా తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ మండిపడ్డారు. గద్దర్ మావోయిజానికి స్వస్తి చెప్పి తెలంగాణ సంస్కృతి, చరిత్రను చాటిచెప్పారని కొనియాడారు. గద్దర్‌ను కాంగ్రెస్ గౌరవిస్తే తప్పేంటని ప్రశ్నించారు. గద్దర్‌తో స్టేజ్ పంచుకున్నారని ఎలా మాట్లాడుతారని.. రాహుల్ గాంధీని బద్నాం చేయడమే బీజేపీ టార్గెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.