జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
బాపట్ల జిల్లాలో బుధవారం పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. భట్టిప్రోలు మండలం రాచూరు గ్రామంలోని పొలాలలో పిడుగు పడి వనజ (35) అనే మహిళ మృతి చెందింది. మరోవైపు తుళ్లూరు మండల కేంద్రంలోని మేరీమాత స్కూల్ మైదానంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.