డంపింగ్ యార్డ్ సమస్యపై గ్రామస్తుల సమావేశం

డంపింగ్ యార్డ్ సమస్యపై గ్రామస్తుల సమావేశం

HNK: జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో నేడు డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలనే డిమాండ్‌తో గ్రామస్తులు రాజకీయ పార్టీలకతీతంగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మడికొండ రాంపూర్ గ్రామాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్‌ను వెంటనే ఎత్తివేయాలని నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్‌కు శాశ్వత పరిష్కారం కనుగొనాలని ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు.