ఆలయ అభివృధ్ధికి భారీ విరాళం

JN: జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ మండల కేంద్రంలోని శివాలయం అభివృద్ధికి రఘునాయకుల రష్మితారెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని ఇవాళ ఆలయ పాలక మండలి సభ్యులకు అందజేశారు. గతంలో ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసిన రవి ప్రసాద్ రెడ్డి కూతురు ఆలయ అభివృద్ధికి చేయూతనందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.