'మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది'

'మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది'

MBNR: వెల్దండ మండలం లింగారెడ్డిపల్లిలో మహిళా శక్తి భవన నిర్మాణానికి సర్పంచ్ మహ్మద్ ఆన్వర్ పాషా భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.