పాముకాటుకు గురైన పారిశుద్ధ్య కార్మికుడు

పాముకాటుకు గురైన పారిశుద్ధ్య కార్మికుడు

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో విధుల్లో ఉన్న ఓ పారిశుద్ధ్య కార్మికుడు పాముకాటుకు గురైన ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ కార్మికుడు మహేశ్ చెత్త సేకరిస్తుండగా పాము కరిచింది. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. కాగా, 108 సిబ్బంది తక్షణమే స్పందించి బాధితుడిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.