12న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

12న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

KRNL: కోడుమూరు మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఈ నెల 12న పరీక్ష నిర్వహిస్తున్నట్లు శుక్రవారం ప్రిన్సిపల్ ఆశాజ్యోతి తెలిపారు. ఉ. 10 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్, గుర్తింపు కార్డుతో గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ఉంటుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.