రేవుపోలవరం సముద్రంలో మునిగి బాలుడి మృతి

VSP: రేవు పోలవరం సముద్ర తీరంలో బుధవారం కనుమ పండుగ రోజున బాలుడు సముద్రంలో మునిగి మృతి చెందగా మరో యువకుడు గల్లంతయ్యాడు. కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన పలువురు రేపు పోలవరం సముద్ర తీరానికి వచ్చారు. వీరిలో సాత్విక్ (10) సముద్రంలోకి దిగి మునిగిపోయాడు. బాలుడిని తీసుకువచ్చేందుకు దిగిన కాకర్ల మణికంఠ (22) గల్లంతయ్యాడు.