VIDEO: జూబ్లీ నగర్ ఘటనపై కీలక వివరాలు వెల్లడి
KNR: జూబ్లీ నగర్ ఘటనపై సీపీ గౌష్ ఆలం కీలక వివరాలు వెల్లడించారు. ఆడపిల్లలు పుట్టారనే కారణంతో తండ్రి శ్రీశైలం పసిప్రాణాలను బావిలో పడేసి హత్య చేసినట్లు తెలిపారు. అతనికి సహకరించిన తాత, నానమ్మ, బాబాయ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యను వేధించడం, చిన్నారులను హత్య చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొంటూ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.