'రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు'
E.G: రైతు సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని గోపాలపురం AMC ఛైర్మన్ యద్దనపూడి బ్రహ్మరాజు స్పష్టం చేశారు. మార్కెట్ యార్డ్‌కు వచ్చే ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో పారదర్శకమైన లావాదేవీలు జరిగేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.