VIDEO: మెడికల్ కాలేజీలో MBBS అడ్మిషన్లు ప్రారంభం

కర్నూలు: నగరంలోని మెడికల్ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఆలిండియా కోటాలో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కళాశాలకు కేటాయించిన 37 సీట్లలో ఏడుగురు విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ఈ నెల 22వ తేదీ వరకు ఆలిండియా కోటా ద్వారా అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఉందని కళాశాల ప్రిన్సిపాల్ శనివారం కె. చిట్టినరసమ్మ తెలిపారు.