బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం జిల్లాలోని రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి విమలరాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 5 నుంచి 18 సంవత్సరాల లోపు వారు సర్టిఫికెట్లతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యా, విజ్ఞానంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ఈనెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.