'కాలినడకన వెళ్లి మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు'

ADB: భీంపూర్ మండలంలోని భగవాన్పూర్, గుబిడిపల్లి గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది శుక్రవారం పర్యటించారు. రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో కాలినడకన వెళ్లి గ్రామంలో పలువురికి వైద్య పరీక్షల నిర్వహించి మందులను అందజేశారు. ఇండ్లను సందర్శించి ర్యాపిడ్ ఫీవర్ సర్వే, ఫ్రైడే డ్రైడే వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు మండల వైద్యాధికారి నిఖిల్ రాజ్ పేర్కొన్నారు.