సృజనాత్మక బోధనకు ప్రశంస

సృజనాత్మక బోధనకు ప్రశంస

NGKL: తిమ్మాజీపేట మండలం గోరిట జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు రాచర్ల నరేందర్ వినూత్న బోధనతో రాష్ట్రస్థాయిలో మెరిశారు. విద్యార్థులకు జ్ఞానం సులభంగా అందించేందుకు పాఠశాల గోడలను విద్యా చిత్రాలతో అలంకరించిన ఆయన సేవలకు తెలంగాణ సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ (ఐఏఎస్) ప్రశంసా పత్రం అందించారు. నరేందర్‌ను రాష్ట్ర అధికారులు ప్రశంసించారు.