ఘనంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర
SRCL: కోనరావుపేటలోని బావుసాయిపేటలో హనుమాన్ జయంతి శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రతి హనుమన్ చిన్న జయంతి సందర్భంగా గ్రామంలోని హనుమాన్ స్వాములు భక్తి పాటలతో జయంతి వేడుకలను జరుపుకుంటారు. మరుసటి రోజు మాలవిరమణకు కొండగట్టు క్షేత్రానికి వెళ్లడం జరుగుతుందని స్వాములు తెలిపారు. మహిళలు మంగళ హారతులతో భక్తి భావం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.