'తప్పనిసరిగా NOC పొందాలి'
NZB: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం అమలుపై జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ అధ్యక్షతన జరిగింది. PCPNDTచట్టం ప్రకారం నమోదు పొందిన వైద్యులు మాత్రమే స్కానింగ్ యంత్రాలను ఉపయోగించాలని తెలిపారు. కొత్త స్కానింగ్ యంత్రాలు కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా NOC పొందాలని సూచించారు.