ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌కింద పడి డ్రైవర్‌ మృతి

ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌కింద పడి డ్రైవర్‌ మృతి

WGL: ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌కింద పడి డ్రైవర్‌ మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం పర్వతగిరి(M) కల్లెడ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాలోత్ వీరన్న ట్రాక్టర్ డ్రైవర్. ట్రాక్టర్‌ టైర్‌ ముందు నిల్చొని మరమ్మతు చేస్తున్నాడు. ట్రాక్టర్‌ గేర్‌లో ఉన్న విషయం గమనించక, సెల్ఫ్‌కొట్టి స్టార్ట్ చేయడంతో ట్రాక్టర్‌ అతని మీదకు వెళ్లి వీరన్న అక్కడికక్కడే మృతిచెందాడు.