దోమ మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

దోమ మండలంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VKB: దోమ మండలం దిర్సంపల్లి, గుండాల సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలకు సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ ఏఈ వినయ్ కాంత్ తెలిపారు. 33 కేవీ మరమ్మతుల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ ఉండదని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.