రేపే తొలివిడత పోలింగ్
TG: రాష్ట్రంలో రేపు తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 1 వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్, సాయంత్రం ఫలితాలు వెలువడనున్నాయి. 395 గ్రామపంచాయతీలు, 9331 వార్డులు ఏకగ్రీవం కాగా.. 3836 గ్రామపంచాయతీలు, 27,960 వార్డులకు పోలింగ్ జరగనుంది.