వాడపల్లి వెంకన్న ఆలయ ఆదాయం వివరాలు

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కళ్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ. 7.84 లక్షలు ఆదాయం వచ్చినట్టు ఈవో తెలిపారు.