ఉగాది పురస్కారం అందుకున్న అర్చక స్వామి

ఉగాది పురస్కారం అందుకున్న అర్చక స్వామి

BPT: అద్దంకి మండలం మనికేశ్వరం గ్రామంలోని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అర్చక స్వామిగా సేవలందిస్తున్న నడింపల్లి లక్ష్మీనారాయణకు ఉగాది పురస్కారం ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లా దేవాదాయ శాఖ, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో అందజేశారు.