'వరి, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలి'
నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రంలో ఇవాళ సీపీఎం మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడుతూ... ప్రభుత్వం వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా సీపీఎం పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో CPM నాయకులు తదితరులు పాల్గొన్నారు.