చిరుత పులి సంచారం.. గ్రామాల్లో చాటింపు

MDK: మాసాయిపేట, తూప్రాన్ మండలాల పరిధిలోని అడవి ప్రాంతంలో చిరుత పులి సంచారంపై ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పులి పిల్లలతో ఒక చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు గ్రామాల్లో చాటింపు చర్యలు చేపట్టారు. రాత్రి వేళలో ఒంటరిగా వ్యవసాయ పొలాలకు వెళ్లొద్దని, పశువులను వ్యవసాయ పొలాల వద్ద ఉంచ్చవద్దని సూచించారు.