గంట్యాడ: అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన మద్యం ధ్వంసం

గంట్యాడ: అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడిన మద్యం ధ్వంసం

విజయనగరం: గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ అక్రమ రవాణ కేసులో పట్టుబడిన మద్యంను విజయనగరం ఎస్పీ ఆదేశాలతో ఏఈఎస్ రాజు ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో సోమవారం ధ్వంసం చేశారు. మొత్తం 14 కేసుల్లో పట్టుబడిన 347 మద్యం సీసాలను ధ్వంసం చేశామని గంట్యాడ ఎస్ఐ సురేంద్రనాయుడు తెలిపారు.