ప్రత్యేక పూజలతో ముగిసిన బ్రహ్మోత్సవాలు

ప్రత్యేక పూజలతో ముగిసిన  బ్రహ్మోత్సవాలు

CTR: పుంగనూరు పట్టణం 30 వార్డులోని శ్రీ భోగ నంజుండేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు సోమవారం ముగిసాయి. అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేయడంతో పాటు స్వామి వారి చిత్రపటాలను అందజేశారు. మూడు రోజులు పాటు జరిగిన ఈ బ్రహ్మోత్సవాలను EO రమణ పర్యవేక్షించారు.