జిల్లాలో భారీ వర్షం

GNTR: జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. సుమారు నాలుగు గంటల పాటు కురిసిందని ప్రజలు తెలుపుతున్నారు. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షం ధాటికి కొందరు భయాందోళనకు గురయ్యారు. అధికారులు అప్రమత్తమై కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేశారు. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.