కడప సమగ్ర అభివృద్ధి కోసం సీపీఐ ఉద్యమాలు

కడప: నగరాన్ని అభివృద్ధి చేసేందుకు సీపీఐ ఉద్యమం చేస్తుందని అందుకోసం ఈ నెల ఏడో తేదీన సామూహిక నిరాహార దీక్ష కడప కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్నామని సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ తెలిపారు. బుధవారం కడప సీపీఐ కార్యాలయంలో నగర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 9 నెలల కూటమి ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు.