'హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి'
KMM: సీపీఎం నేత సామినేని రామారావు హత్యను ఖండిస్తూ సోమవారం నేలకొండపల్లి మండల కేంద్రంతో పాటు అనాసాగరం గ్రామంలో సీపీఎం నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. హత్యకు కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాతర్లపాడులో సీపీఎం పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ గుండాలు హత్యకు పాల్పడ్డారని ఆరోపించారు.