ఉదృతంగా ప్రవహిస్తున్న వేములూరి రిజర్వాయర్

SRPT: మఠంపల్లి మండలలో గత రెండు రోజులు నుంచి వర్షాలు విసృతంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మండలంలోని అన్ని చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద చెరువుల్లో ఒకటైన యాతవాకిళ్ల చెరువు(వేములూరి రిజర్వాయర్ )వరద దాటికి యాతవాకిళ్ల హనుమతులగూడెం రహదారుల మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.