రేపు PUలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు

MBNR: పాలమూరు యూనివర్సిటీలోని ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో ఐక్యూఏసీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, అతిథిగా రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేశ్ బాబు హాజరుకానున్నారు.