బస్సు సౌకర్యం కల్పించాలని CPI(M) నిరసన

NLG: చండూరు మండలం నేర్మటకు బస్సు సౌకర్యం కల్పించాలని CPI(M) మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. బుధవారం నేర్మటలో బస్సు సౌకర్యం కల్పించాలని CPI(M) ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేర్మట నుంచి బోడంగిపర్తి పాఠశాలకు, NLGకు పోయే విద్యార్దులకు, ప్రజలకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.