2025లో లక్షకు పైగా టెక్ ఉద్యోగాల కోత
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు టెక్ పరిశ్రమలో 218 కంపెనీలు లక్ష మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు లేఆఫ్.FYI గణాంకాలు చెప్తున్నాయి. ఈ ఏడాది ఇంటెల్ అత్యధికంగా 24,000 ఉద్యోగాల కోతలు విధించగా.. అమెజాన్ 14,000 కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా కూడా తొలగించాయి. TCS జూలై- సెప్టెంబరు త్రైమాసికంలో దాదాపు 20,000 మందికి ఉద్వాసన పలికింది.