తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
విశాఖపట్నం అక్కిరెడ్డిపాలెంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. రోడ్డుపై అకస్మాత్తుగా ఆగిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టే ప్రమాదం ఏర్పడగా, లారీ డ్రైవర్ చంద్రమోహన్ సమయస్ఫూర్తితో వాహనాన్ని డివైడర్‌పైకి మళ్లించారు. ఆ సమయంలో బస్సులో 52 మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ, ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను తొలగించారు.