ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు

ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలంలో స్థానిక కన్యకా పరమేశ్వరి దేవస్థానం నందు గల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ పెండ్యాల విజయకుమార్, కమిటీ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం మౌనం పాటించి ఆయనకు నివాళులర్పించారు.