దారణం.. పసికందును రోడ్డుపై వదిలేసిన వ్యక్తులు

NTR: జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ పీఎస్ పరిధిలో నెలరోజుల పసికందును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. బుడమేరు వంతెన సమీపంలో ఏడుస్తున్న పాపను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్వల్ప గాయాలతో ఉన్న పసి పాపను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం చైల్డ్ వెల్ఫేర్‌కు అప్పగించారు.