ఘనంగా టీడీపీ కమిటీల ప్రమాణ స్వీకారం
గుంటూరు: జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి అధ్యక్షతన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ డివిజన్ కమిటీలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్‌ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆమె కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అందరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.