రేపు డయాలసిస్ కేంద్రాలకు భూమిపూజ: కేంద్రమంత్రి వర్మ
W.G: భీమవరం, ఆచంటలో రేపు డయాలసిస్ కేంద్రాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. రోజురోజుకీ పెరుగుతున్న డయాలసిస్ రోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని, నరసాపురం పార్లమెంట్ పరిధిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సుమారు రూ. 10కోట్ల CSR నిధులను వెచ్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.