VIDEO: 'ఆ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి'
KDP: ప్రొద్దుటూరులో పూజా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానిక మాజీ MLA శివప్రసాద్ రెడ్డి శనివారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన దస్తగిరి పిల్లల చదువుల కోసం స్కూల్ యాజమాన్యానికి రూ.5 లక్షలు డిపాజిట్ చేశామని, బాధితురాలికి అండగా వెళ్లిన తమ పార్టీ మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవిపై తప్పుడు కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.