కొత్తవలస జిందాల్ కర్మాగారం లాకౌట్, కార్మికులు ధర్నా....

VZM: కొత్తవలస మండలం అప్పన్నపాలెం జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారం శుక్రవారం మొదటి షిఫ్ట్ నుంచి తాత్కాలిక లాకౌట్ ప్రకటించింది. దీంతో కర్మాగారంలో ఉన్న కార్మికులంతా ఆందోళన బాట పట్టారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా లాకౌట్ ప్రకటించడంపై కార్మికులు కర్మాగారం వెలుపల ధర్నా నిర్వహిస్తున్నారు.