గంజాయి జోలికెళ్తే జీవితం నాశనం: సీఐ

గంజాయి జోలికెళ్తే జీవితం నాశనం: సీఐ

ASR: రంపచోడవరం ఏపీ గురుకుల జూనియర్ కాలేజీలో ఆదివారం ఉదయం గంజాయి, డ్రగ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని, కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు అంధకారమవుతుందని హెచ్చరించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించి, వారితో ప్రమాణం చేయించారు.