రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి

రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ మృతి

SKLM: కంచిలి(M)పెద్ద శ్రీరాంపురం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మదనాల పురుషోత్తం (29) జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కవిటి (M) తలగానపుట్టుగ గ్రామానికి చెందిన పురుషోత్తం సోంపేటలో ఉన్న తన బంధువులు ఇంటికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఆటో ఢీకొంది.