ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు.. విద్యార్థి ఆత్మహత్య

ఆన్‌లైన్ గేమ్ కోసం అప్పు.. విద్యార్థి ఆత్మహత్య

NGKL: కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి శివ ప్రసాద్ ఆన్‌లైన్ గేమ్‌ల కోసం రూ. లక్ష అప్పు చేసి, తిరిగి చెల్లించలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. తల్లిదండ్రులకు తెలియజేస్తే ఏమంటారోనన్న భయంతో ఇవాళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటనతో తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు ఆన్‌లైన్ గేమ్‌లను నిషేధించాలని కోరుతున్నారు.