బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

HYD: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని పుష్పాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు. వారం ఆరంభం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.