కమిషనర్ తీరుపై కౌన్సిలర్ల ధ్వజం

VZM: నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ తారక్ నాథ్ పై కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు కమిషనర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పట్టణంలో చేపట్టే ప్రత్యేక పారిశుద్ధ్య పనుల గురించి తమకు సమాచారం ఇవ్వకుండా ముందుగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు.