రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: కుల మత వర్గాలకు అతీతంగా రాష్ట్రంలోని ప్రజలందరి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రాము అన్నారు. గుడ్లవల్లేరు మండలం అంగులూరు, చంద్రాల గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. అంగులూరు పీఏసీఎస్ త్రీ మెన్ కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ప్రారంభించారు.