VIDEO: రాజమౌళికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రేవూరి

VIDEO: రాజమౌళికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే రేవూరి

WGL: గీసుకొండ మండలంలోని జాతీయ ఆదర్శ గ్రామం గంగాదేవిపల్లి మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి నిన్న గుండెపోటుతో మృతిచెందారు. ఆయన భౌతిక దేహానికి సోమవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట వివిధ గ్రామాల సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.