యువకులకు వాలీబాల్ కిట్, బియ్యం అందజేత

VZM: ఆండ్ర పోలీసు స్టేషన్ పరిధిలోని శివారు గిరిజన ప్రాంతమైన కొండపర్తి గ్రామంలో ఎస్సై సీతారాం, సిబ్బంది ఆదివారం గ్రామస్తులతో చట్టాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో డయల్ 100, 108 వినియోగించుకోవలన్నారు. నాటుసారా జోలికి వెళ్ళొద్దని కోరారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహించాలని హితవు పలికారు. ఆనంతరం యువకులకు వాలీబాల్ కిట్,100 కిలోల బియ్యం అందజేశారు.