లారీని ఢీకొట్టిన ఆటో.. ఐదుగురికి గాయాలు
KMM: లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలైన ఘటన గార్ల మండలంలోని మర్రిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ బర్లగూడెంలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు తన భార్య, ఇద్దరు పిల్లలతో ఆటోలో వెళ్తుండగా, ఖమ్మం -ఇల్లందు రహదారిపై మర్రిగూడెం వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ సహా ఐదుగురికీ గాయపడ్డారు.