రోడ్డుకి అడ్డంగా ఇనుప బడ్డీ.. ప్రజల ఇబ్బందులు
కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం లో ఆదివారం రాత్రి రోడ్డుకి అడ్డంగా బడ్డీ ఒకటి దర్శనం ఇచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుకు అడ్డంగా ఇనుప బడ్డీ పెట్టి వదిలి వెళ్లిపోయారని స్థానికులు చెప్తున్నారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వాహనాలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.